స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank Of India )  సొంత ఇంటి ( Own House )  కలను సాకారం చేసుకునే వారికి శుభవార్త తెలిపింది.  తన హోమ్ లోన్ వడ్డీ  రేట్లను భారీగా తగ్గించింది.  దీంతో లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఎస్‌బీఐ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లను (Home Loan Interest Rate )  తగ్గించింది. తగ్గిన ఈ వడ్డీ రేట్లు జులై  1 నుంచే అమలులోకి వచ్చాయి. తాజాగా 6.95 శాతానికే ఇంటి రుణాలు అందిస్తోంది.  అయితే ఇంతకుముందే జూన్ నెలలో ఎస్‌బీఐ  ఈబీఆర్ ( External Benchmark Linked Lending Rate ),  ఆర్ఎల్ఎల్ఆర్ ( Repo Linked Lending Rate) బేసిక్ సూచీలో  లో 40 పాయింట్స్ తగ్గించింది.


Also Read :2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణకు ఆదేశం



 


ఒకప్పుడు కొన్ని బ్యాంకులు హోమ్ లోన్స్‌ను 9 శాతానికి అందించేవి. అయితే స్టేట్ బ్యాంక్  ఆఫ్ ఇండియా తన వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ఒక వైపు వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. మరో వైపు ఈ సెగ్మెంట్‌లో ఇతర బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.  అయితే  ఇప్పటికే  బ్యాంక్ ఆప్ బరోడా ( Bank Of Baroda )  అతి తక్కువ వడ్డీ రేటుకు  ( 6.85 శాతం ) హోమ్ లోన్ అందీస్తోంది.  తరువాత స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది . Also Read : Bank Holidays: జులైలో బ్యాంకు సెలవులు ఇవే..